FbTelugu

బెంగుళూరులో సంపూర్ణ లాక్ డౌన్

కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో బెంగుళూరులో రెండు రోజుల పాటూ సంపూర్ణ లాక్ డౌన్ విధించనున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. ఈ లాక్ డౌన్ నిన్నటి నుంచి సోమవారం సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగనున్నట్టు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా చెన్నైలో లాక్ డౌన్ ఆంక్షలను సడలించారు. ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు ఫుడ్ డెలివరిని అనుమతించారు. కిరాణా షాపులు, కూరగాయల దుకాణాలు, టీ స్టా్ళ్లకు ఉదయం 6:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు అనుమతించారు.

You might also like