FbTelugu

ఏపి సిఐడి అధిపతిపై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు

న్యూఢిల్లీ: ఏపి సిఐడి అదనపు డిజి పివి.సునీల్ కుమార్ పై ఇప్పటికే వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణమరాజు కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేయగా, ఆయన పై మరొకరు ఫిర్యాదు చేశారు.
సునీల్ కుమార్ సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని లీగల్ రైట్స్ అడ్వైజరీ కన్వీనర్ ఎన్ఐ జోషి ఫిర్యాదు చేశారు. మాల కులం రిజర్వేషన్ తో ఐపిఎస్ కు ఎంపిక అయిన ఆయన క్రిస్టియన్ గా మారినందున సర్వీసు నుంచి తప్పించాలని కేంద్ర హోం శాఖను కోరారు.

మతం మారిన వారు రిజర్వేషన్ వదులుకోవాలని ఇటీవలే మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చిందని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో సునీల్ కుమార్ ప్రారంభించిన సంస్థపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ మిషన్ పేరుతో హిందూ వ్యతిరేక భావాలను సునీల్ ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఆయనపై సెక్షన్ 153 (ఏ), 295 (ఏ) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారించి చర్యలు తీసుకోవాలని జోషి తన లేఖలో అభ్యర్థించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.