FbTelugu

వైసీపీ ప్రభుత్వంపై రాష్ట్రపతికి ఫిర్యాదు

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ జగన్ ప్రభుత్వ విధానాలపై టీడీపీ ఎంపీలు భారత రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకెళితే.. ఏపీలో వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ.. టీడీపీ ఎంపీలు ఇవాళ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదులో పలు అంశాలను వారు లేవనెత్తారు. వైసీపీ ఏడాది పాలనలో ప్రతిపక్షాలను అణచివేయాలన్న దోరణిలోనే పాలన సాగిస్తున్నట్టు పెర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో ఎంపీ గల్లా జయదేవ్, కేసినేని నాని, రామ్మోహన్ నాయుడు ఉన్నారు.

You might also like