FbTelugu

తాండూరు ఎమ్మెల్యే విద్యార్హతపై ఫిర్యాదు

హైదరాబాద్: తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సిఈఒ) శశాంక్ గోయల్ ను కలిసి  కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కలిసి టిఆర్ఎస్ ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేశారు.

తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తప్పుడు విద్యార్హత సర్టిఫికేట్ తో పట్టభద్రుని ఓటు నమోదు చేసుకున్నారని ఆయనకు తెలిపారు. ఆయన విద్యార్హతల పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పూటకో విద్యార్హత చెబుతూ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే గ్రాడ్యుయేట్ కాకపోయినప్పటికీ మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశారన్నారు. అతని సర్టిపికెట్లపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.