FbTelugu

ఈటల ‘‘ఫేక్’’ లెటర్ పై పిఎస్ లో ఫిర్యాదు

హన్మకొండ: మాజీ మంత్రి ఈటల రాజేందర్ పై పనికట్టుకుని అసత్యాలతో లేఖ తయారు చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వీణవంక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు అందింది.
మామిడాలపల్లి గ్రామానికి చెందిన పుప్పాల రఘు ఇవాళ వీణవంక పోలీసు స్టేషన్ కు వెళ్లి తన ఫిర్యాదు అందచేశారు. ప్రెస్ అండ్ పొలిటికల్ అండ్ పోలీసు వాట్సప్ గ్రూపులో ఇవాళ మాజీ మంత్రి ఈటల రాజేందర్ లేఖ రాసినట్లుగా ఒకటి షేర్ చేశారని తెలిపాడు. ఈటల పేరుతో నకిలీ లెటర్ హెడ్ తయారు చేసి, సిఎం కెసిఆర్ కు తాను తప్పు చేసినట్లు లేఖను సృష్టించి షేర్ చేయడం క్షమించరాని నేరమన్నారు. రాజేందర్ ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా లేఖలో అంశాలను చొప్పించారని, ఇలాంటి తప్పుడు సమాచారంతో లేఖ తయారు చేసిన వారిపై, షేర్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. వాట్సప్ గ్రూపులో మాడ సాధవ రెడ్డి షేర్ చేశారని, ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది విచారించాలని రఘు డిమాండ్ చేశారు.

ఇవాళ ఉదయం నుంచి వైరల్ అవుతున్న ఈ లేఖలో ఈటల రాజేందర్ తాను టిఆర్ఎస్ లో ఉంటూ చేసింది తప్పేనని ఒప్పుకున్నారు. పార్టీకి వ్యతిరేకంగా సమావేశాలు జరిపింది నిజమేనని, తనతో పాటు పెద్దపల్లి జిల్లాకు చెందిన లీడర్లు కూడా హాజరుకావడం నిజమేనని ఒప్పుకున్నట్లు లేఖలో ఉంది. తామంతా పార్టీకి విధేయులుగా ఉంటామంటూ పేర్కొన్నారు. మీతో సాన్నిహిత్యం ఎంతో గొప్పదని, మీరు నా వేలు పట్టుకుని నడిపించారని కూడా కేసీఆర్‌ను ఈటల కీర్తించారు. అయితే ఈ లెటర్‌లో ఈటల సంతకం ఉన్నాతేదీ రాయకుండా సోషల్ మీడియాలో షేర్ చేశారు. మీరు నా తప్పులను సరిదిద్దుకోవటానికి ఈ ఒక్కసారికి అవకాశం ఇస్తారని భావిస్తున్నానని ఈటల పేర్కొనడం వంటి అంశాలు అందులో ఉన్నాయి. ఈటల ను నైతికంగా దెబ్బతీసేందుకు ఇలాంటి నకిలీ లేఖలను టిఆర్ఎస్ నాయకులు సృష్టిస్తున్నారని ఆయన అభిమానులు ఆరోపిస్తున్నారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.