హైదరాబాద్: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్ లపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు అందింది.
మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రి అవినీతి కార్యకలాపాలపై హైకోర్టులో పిటిషన్ వేసిన తనపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారని బాధితుడు రాఘవేంద్ర రాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను వేధిస్తున్నారని, చంపేస్తామని బెదిరిస్తున్నారని జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. మంత్రి అవినీతి కార్యకలాపాలు, సోదరుడి భూకబ్జాలపై ఎవరు ప్రశ్నించినా వారిపై అక్రమ ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు పెడుతున్నారన్నారు. మంత్రి నుండి తనకు ప్రాణహాని ఉందని… గత నెల 21 న తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని బాధితుడు తెలిపారు. తనకు ప్రాణ రక్షణ కల్పించాలని, మంత్రి , అతని సోదరుడు, మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ పై చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరాడు.