FbTelugu

నాగబాబుపై ధర్మసాగర్ పీఎస్ లో కేసు

వరంగల్: సినీ నటుడు నాగబాబుపై ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి కేసు పెట్టాడు. వివరాల్లోకెళితే.. నాగబాబు గాంధీజీని విమర్శిస్తూ.. ప్రజల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలో

పోస్టులు పెట్టారంటూ అమరేందర్ రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాగబాబుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. ట్విట్టర్ లో గాడ్సే గురించి నాగబాబు కొద్ది రోజుల క్రితం ఓ పోస్టు పెట్టిన విషయం తెలిసిందే.

You might also like