FbTelugu

అమ్మాయిల లో దుస్తులపై ఫిర్యాదు

లక్నో: జనాల్లో ఈ మధ్య చాదస్తం ఎక్కువైంది. ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ లేనిపోని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె లో దుస్తులు పోయాయని, వాటితో చేతబడి చేస్తారేమోనంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేయడం శోచనీయం.
లో దుస్తుల దొంగతనానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మీరట్ నగరంలో అమ్మాయిల లోదుస్తులు పోయాయంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దొంగలు ఎవరైనా ఖరీదైన వస్తువులను కాని డబ్బులను గాని దొంగతనం చేయడం విన్నాం.

కాని వీరెవరో వింతగా అమ్మాయిల లోదుస్తులను అపహరించారు. పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారనే వార్తను విన్న ఆ ప్రాంతంలోని ప్రజలందరూ అవాక్కవుతున్నారు.
ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పోలీసులు సీసీటీవీ ఆధారంగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. స్కూటీపై ఇద్దరు యువకులు అమ్మాయి లోదుస్తులను దొంగిలించి పారిపోతున్నట్లు అక్కడి సీసీటీవీలో రికార్డయింది. ఈ విషయంపై, ఎ.ఎస్.పి సూరజ్ రాయ్ మాట్లాడుతూ బాలికల బట్టలు దొంగిలించే ఈ ప్రత్యేకమైన కేసుపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించి ఒక యువకుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని, మరో వ్యక్తి కోసం వెతుకుతున్నామని ఆయన తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.