FbTelugu

పోటీపడుతున్న తెలుగు రాష్ట్రాలు?

నాలుగో స్థానంలో ఏపీ, ఆరో స్థానంలో తెలంగాణ

న్యూఢిల్లీ: ఒకప్పుడు తప్పనిసరి అయితే తప్పు అప్పులు తీసుకోకుండా పాలన చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత అప్పులు చేయడంతో పోటీపడుతున్నాయి.
ఏదైనా రాష్ట్రం అభివృద్ధిలో పోటీపడుతుంది కాని అప్పులు తీసుకోవడంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో పోటీపడుతుండడంతో ఆర్థికవేత్తలను కలవరానికి గురిచేస్తున్నది. అప్పు తీసుకుంటే తప్ప ప్రభుత్వం నడపలేని దుస్థితికి పాలకులు దిగజార్చారు. బహిరంగ మార్కెట్‌ నుంచి అప్పులు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌ 4వ, తెలంగాణ 6వ స్థానంలో నిలిచి సంచలనం సృష్టిస్తున్నాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం 2020 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు ఆంధ్రప్రదేశ్‌ రూ.44,250 కోట్లు, తెలంగాణ రూ.36,354 కోట్ల రుణాలను బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరించాయి.

ఏపీ ప్రభుత్వం డిసెంబరులో 30 రోజులపాటు స్పెషల్‌ డ్రాయింగ్‌ సౌకర్యం, 26 రోజులపాటు చేబదుళ్లు, 3 రోజులపాటు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం గమనార్హం. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం 28 రోజులపాటు స్పెషల్‌ డ్రాయింగ్‌ సౌకర్యం, 20 రోజులపాటు చేబదుళ్లు, 13 రోజులపాటు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని వాడుకుంది. నెలవారీగా బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు తీసుకున్నాక కూడా రాష్ట్ర ఆర్థిక అవసరాలు తీరకపోతే ప్రభుత్వాలు మరో ప్రత్యమ్నాయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు అదే దారిలో ఉన్నాయి. పైనే పేర్కొన్న మూడింటిలో ఏదో ఒక సౌకర్యాన్ని వాడుకొని ఆర్థిక ఇబ్బందుల నుంచి తాత్కాలికంగా బయటపడుతుంటాయి. కాని దీనికి పూర్తి విరుద్దంగా మూడింటినీ ఒకదాని తర్వాత ఒకటి వాడుకోవడం ఆర్థిక నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తున్నది. అంటే రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక ఇబ్బందుల తీవ్రతకు అద్దం పడుతుంది. డిసెంబరు నాటికి ఏపీ ప్రభుత్వం గత ఏడాది 12 నెలల్లో తీసుకున్నదానికంటే 4.3% అధికంగా అప్పుచేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా గత ఏడాది తీసుకున్నదాంట్లో 98.45%కి సమానమైన మొత్తాన్ని అప్పులు చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.