FbTelugu

టీటీడీ ఆస్తుల విక్రయానికి కమిటీలు!

తిరుమల: నిరర్థక పేరుతో అత్యంత విలువైన, వారసత్వంగా వస్తున్న భూములను విక్రయించేందుకు టీటీడీ సిద్ధమైంది.

తమిళనాడు రాష్ట్రంలో 23 చోట్ల ఉన్న విలువైన ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ పాలక మండలి తీర్మానం చేసింది. ఈ ఆస్తుల విక్రయానికి మొత్తం 8 కమిటీలను ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది. బహిరంగ వేలం ద్వారా ఆస్తులను విక్రయించనున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ అధికారం కూడా సంబంధిత అధికారులకు కట్టబెట్టారు.

శ్రీవారి ఆస్తులన విక్రయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ పాలక మండలి నిర్ణయంపై జనసేన భగ్గుమన్నది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.

You might also like