FbTelugu

ఈటల పై నలుగురు ఐఏఎస్ లతో కమిటీ

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ చుట్టూ ఉచ్చు బిగించేందుకు సిఎం కెసిఆర్ తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. మేడ్చల్ మండలం శామీర్ పేట మండలం దేవరయాంజాల్ లో ఈటల భూ ఆక్రమణపై కమిటీ వేశారు.

ఈ కమిటీలో నలుగురు ఐఏఎస్ అధికారులను నియమించారు. రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్, పంచాయతీ రాజ్ కమిషనర్ కె.రఘునందన్ రావు నేతృత్వంలో కమిటీ వేశారు. ఈ కమిటీలో నల్లగొండ, మంచిర్యాల, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు సభ్యులుగా నియమించారు. మొత్తం 9 అంశాలపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. దేవాదాయ శాఖకు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎంత మంది ఆక్రమించారు, ఎంత విలువ ఉందనేది తెల్చనున్నారు. దాదాపు వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఆక్రమణకు గురయ్యాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ భూములు ఈటల, ఆయన బినామీల ఆధీనంలో ఉన్నాయనేది ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.