FbTelugu

స్వర్ణ ప్యాలెస్ ను సందర్శించిన కమిటీ

కృష్ణా: విజయవాడలోని ప్రమాదం జరిగిన హోటల్ స్వర్ణ ప్యాలెస్ ను జిల్లా కలెక్టర్ నియమించిన జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని శివ శంకర్ కమిటీ పరిశీలించింది. దుర్ఘటన ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ప్రభుత్వ అనుమతులపై రమేష్ హాస్పిటల్ యాజమాన్యం నుంచి సేకరించారు.

ఆ తరువాత జేసీ శివ శంకర్ మాట్లాడుతూ, మూడు అంశాల ప్రాతిపదికన విచారణ చేస్తున్నామన్నారు. స్వర్ణ ప్యాలెస్ హోటల్లో సంరక్షణా చర్యలు ఉన్నాయా? కోవిడ్ నిబంధనల ఫాలో అయ్యారా? ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? అనే దానిపై విచారిస్తున్నామని తెలిపారు. ప్రాధమికంగా విచారించిన తరువాత నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందచేస్తామని ఆయన తెలిపారు.

కోవిడ్ బాధితులను రమేష్ ఆసుపత్రి యాజమాన్యం ఎలా అడ్మిట్ చేసుకుంది, హాస్పిటల్ లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఫీజులు తీసుకుంటున్నారా, రమేష్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నడుస్తున్న కోవిడ్ సెంటర్ లో ట్రీట్ మెంట్ ఎలా అందిస్తున్నారు అనే అంశాలపై విచారణ చేపట్టామన్నారు.

You might also like