FbTelugu

కరోనాపై మంత్రుల కమిటీ భేటీ

గుంటూరు: రాష్ట్రంలో కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ వేగవంతం, హాస్పిటల్స్ లో బెడ్స్, ఆక్సిజన్, రెమిడెసివర్ ఇంజక్షన్స్, పలు అంశాలపై ఇవాళ గ్రూప్ అఫ్ మినిస్టర్స్ భేటీ కానున్నారు.

మంగళగిరి ఏపిఐఐసి బిల్డింగ్ 6వ బ్లాక్ కాన్ఫరెన్స్ హల్ లో ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మంత్రులు కమిటీ కన్వీనర్ ఆళ్ల నాని అధ్యక్షతన గ్రూప్ అఫ్ మినిస్టర్స్ సమావేశం జరుగుతుంది. మంత్రులు బుగ్గన రాజేంద్ర నాద్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, డాక్టర్ సిదిరి అప్పలరాజు పాల్గొంటారు. ఏపి డిజిపి, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాదికారులు, సంబంధిత శాఖల అధికారులు హాజరుకానున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.