FbTelugu

ఐపిఎల్ ను వెంటనే రద్దు చేయాలి: గ్యారీ లినేకర్

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలో ఐపిఎల్ నిర్వహణపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంతటి దారుణ పరిస్థితుల్లో కూడా ఐపిఎల్ నిర్వహించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ లీగ్ ను కొనసాగించడం దారుణమైన తప్పిదమని ఇంగ్లండ్ మాజీ ఫుట్ బాలర్, కామెంటేటర్ గ్యారీ లినేకర్ అన్నారు. ఒక క్రికెట్ అభిమానిగా ఎంతో ప్రేమిస్తాను కాని ప్రస్తుతం ఇండియాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇది ఘోరమన్నారు. మ్యాచుల్లో పరుగుల కన్నా వేగంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని లినేకర్ ట్వీట్ చేశారు. అంతర్జాతీయ పత్రిక గార్డియన్ కూడా సెటైర్ వేసింది. కోట్లు వచ్చే వాటిని ఎట్టి పరిస్థితుల్లో విమర్శించకూడదు. వాటిలో ఐపిఎల్ అత్యంత పవిత్రమైందని వేలెత్తి చూపింది. బిసిసిఐని కార్యదర్శి జై షా నడిపిస్తున్నాడని తెలిపింది. ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు. మానవత్వం కోసం ఆడుతున్నామని అంటూ తమ ఫ్రాంచైజీలకు బిసిసిఐ పంపిన ఈ మెయిల్ ను సిడ్నికి చెందిన మార్నింగ్ హెరాల్డ్ ఎద్దేవా చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.