FbTelugu

17నుంచి అమెరికా కాన్సులేట్ సేవలు ఆరంభం

హైదరాబాద్: సోమవారం నుంచి అమెరికా కాన్సులేట్ లో సేవలు అందుబాటులో ఉంటాయని అమెరికా కాన్సులేట్ ప్రకటించింది. స్టూడెంట్ వీసాలతో పాటు, ఉద్యోగ వీసాల సేవలు ప్రారంభం అవుతాయని తెలిపింది.

లాక్ డౌన్, కరోనా వైరస్ కారణంగా బేగంపేటలోని అమెరికా కాన్సులేట్ లో సేవలను నిలిపివేసిన విషయం తెలిసిందే. కరోనా ఉధృతి ఇప్పట్లో తగ్గే అవకాశం లేకపోవడంతో కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. సోమవారం నుంచి యధావిధిగా కాన్సులేట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

You might also like