FbTelugu

అమర రాజా బ్యాటరీ మూత కు ఆదేశాలు

విజయవాడ: చిత్తూరు జిల్లాలో అమర రాజా బ్యాటరీ కంపెనీల కు రాష్ట్ర కాలుష్య నియంత్రణ, నివారణ మండలి (ఏపిపిసిబి) మూసివేత ఆదేశాలు జారీ చేసింది.
నూనెగుండ్లపాడు, కరకంబడి పరిధిలో ఉన్న పరిశ్రమల మూసివేతకు నోటీసులు పంపించారు. అమర రాజా కంపెనీల నుండి ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని కాలుష్య నియంత్రణ మండలి నిర్ధారించింది.

చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రక్త నమూనాలు కూడా పరీక్షించారు. రక్త సీస విలువలు అధికంగా (బ్లడ్ లీడ్ వాల్యూ) ఉన్నట్టు గుర్తించారు. ఇది చుట్టుపక్కల ప్రజల ప్రాణాలకు ముప్పని స్పష్టం అయ్యింది. పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలపై పలు దఫాలు పిసిబి అధికారులు కంపెనీల్లో తనిఖీలు చేపట్టిన తరువాతే షో కాజ్ నోటీస్ లు కూడా జారీ చేశారు. షో కాజ్ నోటీస్ లకు కంపెనీ ఇచ్చిన సమాధానం తో సంతృప్తి చెందని కాలుష్య నియంత్రణ మండలి మూసివేత నోటీసులు జారీ చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.