FbTelugu

‘శ్రీశైలం’ స్కాంపై ఏసీబీ విచారణ

కర్నూలు: శ్రీశైలం దేవస్థానంలో చోటుచేసుకున్న రూ.2.52 కోట్ల స్కామ్ పై ఏసీబీ విచారణకు దేవాదాయ శాఖ ఆదేశించింది. 2016 నుంచి ఆన్ లైన్ టికెట్ల విక్రయాలు, విరాళాలు, అభిషేకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నట్టు అధికారులు గుర్తించారు.

ఈ నేపథ్యంలో జరిగిన సుమారు రూ.2.52 కోట్ల స్కామ్ పై మూడు నెలల్లో ఏసీబీ నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసు విచారణలో అక్రమాలు జరిగినట్లు తేలిన విషయం తెలిసిందే. పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చేందుకు ఏసీబీ విచారణకు ఆదేశించారు.

You might also like