FbTelugu

త్వరలో మనోధైర్య యాత్ర: ఎంపీ రాజు

ఢిల్లీ: రాజు ఆగస్ట్ 20 తరువాత రాష్ట్రానికి వెళ్లి మనోధైర్య యాత్ర చేపడతానని, నేను పార్టీ విధేయుడిని.. ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ను గౌరవిస్తానని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
రాష్ట్రంలో నా దిష్టి బొమ్మలు తగల బెట్టడం, దుర్భాష లాడటంతో భద్రత కల్పించాలని కేంద్రాన్ని కోరానని, తనకు భద్రత కల్పించినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. ఏపీలో పేరు చివర రెడ్డి అని తోక ఉన్నవారు అసభ్య పదజాలం వాడుతున్నారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. అమరావతిలో రాజధాని కాపాడమంటూ మహిళలు గాంధేయ మార్గంలో నిరసన వారిని తెలుపుతుంటే కుక్కలతో పొలుస్తు సామజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారన్నారు. పేరు చివర రెడ్డి ఉన్న వ్యక్తులను కాపాడేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎంపీ ఘాటుగా విమర్శించారు.

కుక్కలు వేట కుక్కలై తరిమేరోజులు దగ్గరలోనే ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు అన్నారు. రాజధాని తరలింపు వల్ల చనిపోయిన వారిని ముఖ్యమంత్రి జగన్ స్వయంగా పరామర్శించాలని కోరారు. ఒక పార్లమెంటు సభ్యుడిగా మనోధైర్య యాత్ర చేపట్టబోతున్నానని, రాజధాని తరలింపు వల్ల నష్టపోతున్న వారికి ధైర్యం చెబుతానన్నారు. అయోధ్యలో రామ మందిర భూమి పూజ నేపథ్యంలో రాష్ట్రంలోని దేవాలయాల్లో పూజలు, ఎస్వీబీసీ ఛానల్ లో లైవ్ టెలికాస్ట్ చేయమన్నా చేయలేదన్నారు.ఎమ్మెల్యే తలారి వెంకట రమణ జగన్ కు గుడికట్టడాన్ని హిందువుగా వ్యతిరేకిస్తున్నామన్నారు. జగన్ కు చర్చి కట్టుకోండి.. ప్రేమాలయం కట్టుకోండని ఆయన సూచించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని ఖండించారు. హిందు సంస్కృతిని ముఖ్యమంత్రి దెబ్బతీయవద్దన్నారు.

అయోధ్యలో రామ మందిర భూమి పూజ సందర్భంగా జగన్ దేవాలయానికి భూమి పూజ ఎబ్బెట్టుగా ఉందన్నారు. ప్రజాస్వామ్యం లో ఎన్నుకున్న వారిని ఎలా రాజీనామా చేయమంటారో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణను ప్రశ్నించారు. నన్ను మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటున్నారు.. బొత్స వ్యాఖ్యలు దృష్టిలో ఉంచుకోవాలన్నారు. విభజన చట్టంలో ఉన్న అంశాల ఆధారంగానే అమరావతి రైతులు కోర్టులకు వెళ్లారన్నారు. విభజన చట్టంలో రాజధాని ఆని మాత్రమే ఉంది రాజదానులు అని లేదన్నారు.
గత ముఖ్యమంత్రి అందరితో చర్చించి సీఆర్డీఏ చట్టం తీసుకువచ్చారు.. చట్టాన్ని ఉల్లంఘించే అధికారం ఎవరికి లేదన్నారు. న్యాయస్థానాల్లో ఖచ్చితంగా అమరావతి రాజధానికి న్యాయం జరుగుతుందన్నారు. విభజన చట్టం మారిస్తే తప్ప ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరైనవి అవుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అమరావతి పోరాటం కేంద్రం తీసుకువచ్చిన చట్టంతో ముడిపడి ఉంది.. ప్రజలెవరు అధైర్యపడవద్దు అని ఎంపీ రాజు అన్నారు.

అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని, పరిపాలనా రాజధానిగా కొనసాగించాలన్నారు. కావాలంటే క్యాంప్ ఆఫీస్, లేజిస్లేటివ్ క్యాపిటల్ వేరే చోట పెట్టుకోండని సలహా ఇచ్చారు. విశాఖ వాసులు రాజధాని వద్దనుకుంటున్నారని ఎంపీ రాజు స్పష్టం చేశారు.

You might also like