FbTelugu

ఎంసెట్ పై త్వరలో నిర్ణయం

హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఎంసెట్ నిర్వహణపై రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నది. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం జులై 5 నుంచి 9 వరకు జరిగే పరీక్షలను ఆగస్టు కు వాయిదా వేయనున్నట్లు తెలిసింది.

తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రద్దు చేసింది. మార్కులు ఎలా వేయాలనే దానిపై కమిటీ వేశారు. మార్కులు కేటాయించకుండా ఎంసెట్ నిర్వహిస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉందని అప్రమత్తమయ్యారు. సాధారణంగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగిన తరువాత ఎంసెట్ పరీక్షలు జరిగేవి. ఎంసట్ ను నిర్వహించకుండా మెడికల్, ఇంజనీరింగ్ లో సీట్లు కేటాయించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో రెండు మూడు రోజుల్లో ఉన్నత విద్యా మండలి సమావేశమై ఆగస్టు కు వాయిదా వేసే అవకాశలే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి దాకా ఎంసెట్ కు 220,207 దరఖాస్తులు అందాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.