FbTelugu

పాజిటివ్ రోగులకు మళ్లీ వస్తుంది… తస్మాత్ జాగ్రత్త!

వాషింగ్టన్: కరోనా పాజిటివ్ సోకిన వారిలో వైరస్ అంత త్వరగా బయటకు వెళ్లిపోదని, ఎనిమిది నెలల వరకు శరీరంలో దాగి ఉంటుంది ఒక సర్వేలో వెల్లడి అయింది. కోలుకున్నవారు కొన్ని నెలల పాటు జాగ్రత్తగా ఉండాలని సర్వే సంస్థ స్పష్టం చేసింది.

కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న గతేడాది జూలై నెలలో అల్లెసాండ్రో సెట్టె ఆఫ్ లాజోల్ల ఇనిస్టిట్యూట్ సర్వే నిర్వహించింది. షేన్ కాట్రీ, డానియల్ వెస్కాఫ్ తో కలిసి ఈ సర్వే చేపట్టారు. మొత్తం 188 మంది బాధితుల రక్త నమూనాలు సేకరించారు. యాంటీ బాడీస్ ను వైరస్ కిల్ చేస్తుందని, బీ సెల్స్, టీ సెల్స్ ను కూడా నాశనం చేస్తుందని పరీక్షల్లో వెల్లడైంది. దీని మూలంగా రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపి దుష్ప్రభావం వచ్చే ప్రమాదముందని వెల్లడించారు.

పాజిటివ్ వచ్చిన వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సార్స్ వ్యాధి సంక్రమించే ప్రమాదముందని, కొన్ని నెలల పాటు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వ్యాధి సోకిన వారిలో కోలుకున్న 60 శాతం మందిలో దుష్ప్రభావం సోకే అవకాశం 16.7 శాతం ఉందని, అది కూడా 65 రోజుల లోపు వచ్చే ప్రమాదముందన్నారు. మళ్లీ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సదరు ఇనిస్టిట్యూట్ స్పష్టం చేసింది.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.