FbTelugu

నోటా ఓట్లతో పోటీపడిన కమేడియన్లు

చెన్నై: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన ఇద్దరు నటులు నోటా కన్నా తక్కువ ఓట్లు సాధించి తమిళ రాజకీయాల్లో జోకర్లుగా మారారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

సినీ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన ఎంజిఆర్, కరుణానిధి, కుమారి జె.జయలలిత, శివాజి గణేషన్, విజయ్ కాంత్ సహా పలువురు విజయబావుటా ఎగురవేశారు. తమిళనాడు రాజకీయాల్లో సినిమా తారల ప్రభావం అధికంగా ఉంటుంది. వీరిని అనుసరించే పలువురు రాజకీయాల్లోకి వస్తన్నారు. నటుడు కమల్ హాసన్, సీమాన్ ప్రాంతీయ పార్టీలు స్థాపించి ఎన్నికల గోదాలోకి దిగి ఓటమిపాలయ్యారు. కోవై దక్షిణం నుంచి పోటీ చేసిన కమల్ హాసన్ బిజెపి మహిళా అభ్యర్థి చేతిలో చిత్తుగా ఓడిపోగా, తిరువొత్తియూర్ లో సీమాన్ మూడో స్థానంలో నిల్చారు. తామేమి తక్కువ కాదన్నట్లు కామేడియన్లు మన్సూర్ అలీఖాన్, మైల స్వామి రాజకీయాల్లో జోకర్లుగా మారారు. సోషల్ మీడియాలో వీరికి వచ్చిన ఓట్లు వైరల్ అవుతున్నాయి. తొండమత్తూర్ లో పోటీ చేసిన మన్సూర్ కు 428 ఓట్లు పోలవ్వగా, నోటాకు 1,622 ఓట్లు వచ్చాయి. అదే విధంగా మైల స్వామి కి 1440 ఓట్లు రాగా నోటాకు 1563 ఓట్లు పోలయ్యాయి. జోకర్లకు నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.