FbTelugu

కమేడియన్ అరెస్టు

ముంబై: ఇప్పటి వరకు తన చేష్టల ద్వారా అందరినీ నవ్వించిన కమేడియన్, కపిల్ శర్మ షో లో నటించిన భారతి సింగ్ అందరి ముందు నవ్వుల పాలయ్యారు. భారతి సింగ్ ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఇవాళ అరెస్టు చేశారు.

శనివారం నాడు భారతి సింగ్ నివాసంపై దాడి చేసి ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించగా గంజాయి లభ్యమైంది. సోదాల తరువాత ఆమెతో పాటు భర్త హార్ష్ లింబాచియాను అరెస్టు చేసి ఎన్సీబీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. అంతకు ముందు శుక్రవారం రాత్రి ఒక డ్రగ్ ఫెడ్లర్ ఇచ్చిన సమాచారం మేరకు పలువురి వివరాలు సేకరించారు. ఆయన ఇచ్చిన సమాచారం మేరకే అంధేరిలోని భారతి సింగ్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు.

పంజాబ్ లో జన్మించి భారతి సింగ్ పలు సినిమాలలో కమేడియన్ గా నటించారు. కామెడి సర్కస్, కామెడి నైట్స్ బచావో, ద కపిల్ శర్మ షో లో నటించిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఎన్సీబీ అధికారులు బాలీవుడ్ సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించి, పలువురిని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నటుడు అర్జున్ రాంపాల్, ఆయన స్నేహితురాలు గాబ్రియెల్లా ను కూడా ప్రశ్నించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.