FbTelugu

క‌ల‌ర్ డ్రీమ్స్‌… క‌రిగే వేళ‌లో!

సినిమా గ్లామ‌ర్ ప్ర‌పంచం. రంగులలోకంలో తేలిపోయేందుకు యూత్ త‌పిస్తుంటారు. వార‌సులుగా చేరి వెండితెర‌ను ఏలేస్తున్న వారు కొంద‌రైతే.. ఏదో విధంగా ముఖానికి రంగులేసుకుని ఒక‌టీ రెండు హిట్లు అందుకుని ఆ త‌రువాత అవ‌కాశాల్లేక అల్లాడి పోతున్నారు.

ఒక్క‌సారి వెలుగుల‌కు అల‌వాటుప‌డ్డాక‌.. త‌రువాత ఎదుర‌య్యే చీక‌ట్ల‌ను త‌ట్టుకోలేక త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఒక్క‌సారి విలాస‌వంత‌మైన జీవితానికి అల‌వాటుప‌డ్డ ప్రాణాలు స్వ‌ర్గానికి.. న‌ర‌కానికి మ‌ద్య త్రిశంకు స్వ‌ర్గంలో కొట్టుమిట్టాడే ప్రాణాలు. స‌ర‌దాల యావ‌లో వేసే త‌ప్ప‌ట‌డుగులు ఉండ‌నే ఉన్నాయి. ఇలా గ్లామ‌ర్‌, విలాసాలు.. రెండూ కేవ‌లం డ‌బ్బున్నంత వ‌ర‌కూ మాత్ర‌మే అనే నిజాన్ని వ‌దిలేసి క‌ల‌ల వెంట ప‌రుగెడుతూ.. అల‌సిపోతున్నారు.

చివ‌ర‌కు ఏం చేయాలో పాలుపోక అర్దాంత‌రంగా మ‌ర‌ణమే శ‌ర‌ణ్యం అనుకుంటున్నారు. సుశాంత్‌సింగ్‌.. ఇలా అనేకంటే. ధోని హీరోగా.. అన్‌టోల్డ్ స్టోరీతో యూత్ ప్రేక్ష‌కుల మ‌న‌సు కొల్ల‌గొట్టాడు. రాత్రికి రాత్రే స్టార‌య్యాడు. అంత‌కు ముందు ప్రేమికుల‌రోజు సినిమాతో అందంగా న‌వ్విన సొట్ట‌బుగ్గ‌ల కునాల్ కూడా ఇలాగే హీరోగా మెప్పించాడు. కానీ.. ఇద్ద‌రూ అక‌స్మాత్తుగా సూసైడ్ చేసుకుని మ‌ర‌ణాల‌ను మిస్ట‌రీగా వ‌దిలేశారు. సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య‌కు కొద్దిరోజుల ముందు ఆయ‌న మాజీ మేనేజ‌ర్ కూడా 14 అంత‌స్తుల భ‌వ‌నం నుంచి కింద‌కు దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఇలా.. క‌న్న‌డ న‌టి చంద‌న‌, బుల్లితెర న‌టుడు మ‌న్మీత్‌సింగ్ ఇలా… లాక్‌డౌన్ స‌మ‌యంలో షూటింగ్‌లు దూర‌మై.

ఉపాధి లేక‌.. మెయింట్‌నెన్స్ భార‌మైన డిఫ్రెష‌న్‌లోకి చేరి ఇలా బ‌ల‌వ‌న్మ‌రణాల‌కు త‌లొగ్గారా! అనేది కూడా ఒక అనుమానం. నిజ‌మే.. వెండితెర‌కు ఇది కొత్తేమీ కాదు.. కొన్ని హ‌త్య‌లు.. మ‌రికొన్ని ఆత్మ‌హ‌త్య‌లు.. నాటి ఫ‌టాఫ‌ట్ జ‌య‌ల‌క్ష్మి నుంచి దివ్య‌భార‌తి వ‌ర‌కూ… అందానికి నిర్వ‌చ‌నంగా ఉన్న తార‌ల మ‌ర‌ణాలు వెనుక వాస్త‌వాలు ఇప్ప‌టికీ.. ఎప్ప‌టికీ బ‌య‌ట‌కు రావు. తెలుగు నాట ప్ర‌త్యూష హ‌త్య ఇప్ప‌టికీ తేల‌లేదు.. తేల‌దు.. అంద‌మే శాపంగా.. నేమ్‌..ఫేమ్ పాపంగా మారిన గ్లామ‌ర్ బ‌తుకుల అర్ధాంత‌రం చావులు.. వెండితెర‌ను వెంటాడుతున్న శాపాలు.

You might also like

Leave A Reply

Your email address will not be published.