FbTelugu

కేసీఆర్ కు రుణపడి ఉంటాం: కల్నల్ కుటుంబం

సూర్యాపేట: సీఎం కేసీఆర్ కు తమ కుటుంబం రుణపడి ఉంటుందని కల్నల్ బి.సంతోష్ బాబు కుటుంబ సభ్యులు తెలిపారు.

కల్నల్ భార్య సంతోషి మాట్లాడుతూ, కేసీఆర్ చెప్పిన విధంగా మా ఇంటికి వచ్చి పరామర్శించారన్నారు. సంతోష్ బాబును తీసుకురాలేనుకాని కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గ్రూప్ వన్ అధికారిగా ఏ డిపార్ట్ మెంట్ లో కావాలంటే అక్కడ ఇస్తామన్నారు.
బంజారాహిల్స్ లో స్థలం కూడా కేటాయించారన్నారు. అమరులైన జవాన్లకు రూ.10 లక్షల చొప్పున తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇచ్చిన కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. కొద్దిసేపు మా పిల్లలతో మాట్లాడారు. కుటుంబ సభ్యులు ఒకరోజు ప్రగతి భవన్ కు రావాలని ఆహ్వానించారన్నారు.

కల్నల్ తల్లి మంజుల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తమకు భరోసా ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆయన రాక మాకు ధైర్యాన్ని ఇచ్చిందన్నారు. మంత్రి జి.జగదీష్ రెడ్డి తమ వెన్నంటి ఉంటున్నారని ఆమె తెలిపారు.
విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ, సూర్యాపేటలో సంతోష్ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. ఏ ప్రాంతంలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలనేది త్వరలోనే కుటుంబ సభ్యులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. కోర్టు, పాత బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు సూచనప్రాయంగా చెప్పారన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.