FbTelugu

కల్నల్ త్యాగం వెలకట్టలేము: కిషన్ రెడ్డి

సూర్యాపేట: కల్నల్ సంతోష్ బాబు త్యాగం వెలకట్టలేమని కేంద్ర హోం శాఖ సహాయ శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు.

ఇవాళ సంతోష్ బాబు కుటుంబాన్ని కిషన్ రెడ్డి పరామర్శించారు. సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమర వీరుని కుటుంబానికి భారత సైన్యం, ప్రభుత్వం పూర్తి అండగా నిలుస్తుందన్నారు. చిన్న వయస్సులో మంచి భవిష్యత్తు ఉన్న అధికారిని కోల్పోయామని, సైన్యానికి కూడా తీరని నష్టమని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

You might also like