FbTelugu

సా.4గంటలకు బేగంపేట్ కు కల్నల్ పార్థీవదేహం

హైదరాబాద్: భారత్-చైనా సరిహద్దులో వీరమరణం పొందిన తెలంగాణ ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు పార్థీవదేహాన్ని ఇవాళ సాయంత్రం 4:00 గంటల సమయానికి హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్టుకు తీసుకురానున్నట్టు సమాచారం.

అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సూర్యాపేటకు తరలించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే హకీంపేట్ కు ఆర్మీ అధికారులు చేరుకున్నారు. కల్నల్ సంతోష్ బాబు తన తల్లికి ఒక్కడే కుమారుడు. అయినప్పటికీ తన తల్లి దేశ సేవకోసం సైన్యంలోకి పంపింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.