ఢిల్లీ: లాకౌ డౌన్ కారణంగా మూతపడిన కళాశాలలు తిరిగి ఆగస్టు ఒకటవ తేదీన పునః ప్రారంభమవుతాయని యూజీసీ ప్రకటించింది.
ఆగస్టు 1వ తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరం క్యాలెంటర్ ప్రారంభం అవుతుందని స్పష్టం చేసింది. అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉంటుందని తెలిపింది.
పెండింగ్ లో పరీక్షలను జూలై, ఆగస్టు నెలలో నిర్వహించాలని, పరీక్షల గడువును 3 గంటల నుంచి రెండు గంటలకు తగ్గించాలని సూచించింది. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన పరీక్షలు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే కొత్త విద్య సంవత్సరంలో ఆరు రోజుల పాటు క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. తరగతి గదుల నిర్వహణ, ల్యాబ్ లు, ఆన్ లైన్ పాఠాలు, వర్చువల్ క్లాసెస్ పై యూజీసీ కళాశాలలకు మార్గదర్శకాలు జారీ చేసింది.