FbTelugu

చిన్నారుల తల్లుల వివరాలు సేకరణ

ఆదేశాలు జారీ చేసిన ఏపి వైద్య ఆరోగ్య శాఖ

అమరావతి: త్వరలో వచ్చే థర్డ్ వేవ్ లో కరోనా వైరస్ చిన్నారులపై అధిక ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఏపి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఫస్ట్, సెకండ్ వేవ్ తప్పిదాలను గుణపాఠంగా స్వీకరించిన ప్రభుత్వం థర్డ్ వేవ్ లో పొరపాట్లు లేకుండా చూడాలని సమాయత్తమవుతోంది.

రాష్ట్రంలో ఐదేళ్ల లోపు పిల్ల తల్లుల వివరాలు సేకరించాలని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డిఎం అండ్ హెచ్ఓ) లను ఆదేశించింది. తల్లులకు వ్యాక్సిన్ ఇచ్చే ఒక రోజు ముందు వారికి టోకెన్ ఇచ్చేందుకు వీలుగా గ్రామాల వారిగా జాబితా సిద్ధం చేయాలని సూచించింది. కరోనా నిబంధనలు అనుసరించి వ్యాక్సిన్ కేంద్రాలకు తల్లులను తీసుకువచ్చే విధంగా నర్సులు, ఆశా వర్కర్లు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. థర్డ్ వేవ్ ప్రారంభమయ్యే లోగానే వ్యాక్సిన్ కార్యక్రమం పూర్తి చేసేందుకు ఆరోగ్య శాఖ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఈ ఉత్తర్వుల్లో స్పష్టమవుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.