FbTelugu

కుప్పకూలిన మూడంతస్తుల హోటల్ భవనం

బెంగుళూరు: నిర్మాణంలో ఉన్న భవనం కారణంగా పక్కనే ఉన్న మూడంతస్తుల హోటల్ భవనం కుప్పకూలింది. ఈ ఘటన బెంగుళూరులోని గాంధీనగర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. స్థానిక గాంధీనగర్ లో కపాలీ థియేటర్ ప్రాంతంలో మల్టీఫ్లెక్స్ నిర్మాణం చేపట్టారు.

పార్కింగ్ కోసం గుంటను తవ్వగా.. పక్కన ఉన్న మూడంతస్తుల హోటల్ భవనం ఒక్క సారిగా కుప్పకూలింది. అయితే కొద్ది రోజుల క్రితమే హోటల్ కు బీటలు వారడంతో ప్రమాదాన్ని ముందుగానే ఊహించి అందులోని వారిని ఖాళీ చేయించారు. దీంతో ప్రాణనష్టం ఏమీ జరగలేదు.

You might also like