FbTelugu

జలుబే… అంత భయం లేదు: కేటీఆర్

హైదరాబాద్:తన ఆరోగ్యంపై వస్తున్న ప్రచారం పైన మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. నిన్నటి నుంచి తన ఆరోగ్యంపై ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

తనకు ఎలాంటి ఇబ్బంది లేదు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నానని మంత్రి కేటీఆర్ తెలిపారు. నిన్న సిరిసిల్లలో పర్యటిస్తున్న సందర్భంగా అనేక సంవత్సరాలుగా నాకున్న జలుబు కు సంబంధించిన ఎలర్జీ వచ్చిందన్నారు. అప్పటికే పర్యటనకు సంబంధించిన పలు కార్యక్రమాలు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో చాలామందికి ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని కొనసాగించాల్సి వచ్చిందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.