FbTelugu

పదేళ్లుగా సహజీవనం… ఇరుగు పొరుగుకు తెలియదు

పాలక్కాడ్: ఆధునిక యుగంలో ఇంటి పక్కన లేదా సమీప ప్రాంతంలో ఏం జరుగుతుందో ఎవరూ గమనించడం లేదు. ఫలితంగా జరగాల్సిన పనులన్నీ జరిగిపోతున్నాయి. నెమ్మర పోలీసు స్టేషన్ లో వింత ప్రేమ కథ బయటకొచ్చింది.

అయిరూర్ గ్రామంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ఒక అమ్మాయి ఇంటి నుంచి 2010 లో పారిపోయింది. పదేళ్ల నుంచి ఆమె ఎక్కడుంటున్నదో తల్లిదండ్రులకూ ఆచూకి లభించలేదు. విచిత్రమేమంటే ఆమె తల్లిదండ్రులు నివాసం ఉంటున్న సమీపంలోనే ఒక అబ్బాయి ఇంటి వద్ద గోప్యంగా ఉంటున్నది. ఈ విషయం అబ్బాయి తల్లిదండ్రులకు కూడా తెలియకపోవడం విశేషం. తాళం వేసిన ఇంట్లో ఆమె పదేళ్లుగా నివాసం ఉంటున్నది. ప్రియుడే ఆమె ను దగ్గరుండి అన్ని చూసుకుంటూ సహజీవనం చేస్తున్నాడు. రాత్రిపూట టాయ్ లెట్ వెళ్లేందుకు మాత్రమే బయటకు వచ్చేది. పగటి పూట ఆ గదికి తాళం వేసి ఉండేది. ఆమెకు తిండి, బట్టలు, మందులు అన్ని అతడే సమకూర్చేవాడు. మూడు నెలల నుంచి తమ కుమారుడు కన్పించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. పోలీసులు విచారించగా నెమ్మర సమీపంలోని విథాన్ సెరి లో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నట్లు తెలిసింది. వారిని అదుపులోకి తీసుకుని విచారించిన తరువాత జిల్లా కోర్టు లో ప్రవేశపెట్టారు. పదేళ్లుగా సహజీవనం చేస్తున్నామని, ఇక నుంచి కలిసే ఉంటామని యువతి కోర్టుకు తెలిపింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేసేందుకు కోర్టు అనుమతించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.