FbTelugu

ఏపిలో కాక్ టెయిల్ ప్రయోగం షురూ

అమరావతి: కరోనా బాధితుల చికిత్సలో కొత్త ఇంజక్షన్ ప్రయోగం ఏపిలో ప్రారంభమైంది. ఇప్పటికే ఢిల్లీలోని మేదాంత హాస్పిటల్ లో వినియోగిస్తున్నారు.
ఈ ఇంజక్షన్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కరోనా రోగికి ఇది ఎక్కించిన తరువాత గంట వ్యవధిలో డిశ్చార్జీ అయి ఇంటికి వెళ్లిపోవచ్చు. ఏపిలో కరోనాకి తొలి మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగించారు. విజయవాడ ఆయుష్ హాస్పిటల్ లో కరోనా చికిత్సలో భాగంగా తొలి ఇంజక్షన్ ఇచ్చారు. వైద్యుల పర్యవేక్షణలో సెలైన్ ద్వారా రక్తనాళం లోకి కేవలం అర్థగంట వ్యవధిలో కరోనా బాధితుడికి కాక్ టెయిల్ ఇంజక్షన్ అందచేశారు. ఆ తరువాత అరగంటలో కరోనా బాదితుడిని ఇంటికి పంపించారు.

కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత ఎంత త్వరగా ఈ మందు వాడితే అంతటి చక్కని ఫలితాలు ఉంటాయని వైద్యులు వివరించారు. ఈ యాంటిబాడీ మందు ల్యాబ్ లో తయారు చేసిన యాంటిబాడీ, ప్రొటీన్ యోక్క సమ్మెళనం అని పేర్కొన్నారు. ఇది కరోనా వైరస్ మీద ఉండే స్పైక్ ప్రొటీన్ ని నిరోదించడం ద్వారా వైరస్ కణాలను గట్టిగా ఎదుర్కుంటుందని వైద్యులు వెల్లడించారు. మానవ కణాల మీద వైరస్ ప్రభావం చూపకుండా అడ్డుపడుతుందని పేర్కొన్నారు.
ఈ ఇంజక్షన్ ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడానికి ముందు మాత్రమే ఉపయోగించాలని అంటున్నారు. 12 సంవత్సరాల వయసు పైబడిన వారికి 40 కిలోల బరువు పైనవారు, స్ధూల కాయులు, 65 ఏళ్ళ వయసు పైబడిన వారు నిరభ్యంతరంగా వాడవచ్చు అన్నారు. వైద్యుల సిఫారసు మేరకు ఎక్కించాలని, లేదంటే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. కిడ్నీ వ్యాధి, లివర్ వ్యాధి ఉన్నవారికి, షుగర్ వ్యాధి అదుపులో లేని వారికి ఈ కాక్ టెయిల్ ఇంజక్షన్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుందని వైద్యులు వివరించారు. ఒక ఇంజక్షన్ ధర రూ.70వేలు కాగా రెండు తీసుకుంటే రూ.1.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.