FbTelugu

మరో 10 రోజులు లాక్ డౌన్ పొడిగింపు?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో పది రోజుల పాటు లాక్ డౌన్ పొడగించే అవకాశాలు ఉన్నాయి. కేసులు అదుపులోకి రాకపోవడం, వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం లాక్ డౌన్ పెంచడం మినహా ప్రభుత్వం ముందు మరో మార్గం లేదని నిపుణులు అంటున్నారు.
లాక్ డౌన్ ఈ నెలాఖరుతో ముగియనున్నది. ఆదివారం నాడు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో లాక్ డౌన్ కొనసాగింపు, కరోనా చికిత్స, ధాన్యం కొనుగోలుపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

దేశంలో కరోనా అదుపులోకి రాలేదని, ప్రతి రోజు సుమారు 3 లక్షల వరకు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని కేంద్ర హోం శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాలలో కేసులు తగ్గినప్పటికీ మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. కేసుల సంఖ్య తగ్గే వరకు మరో నెల రోజుల వరకు లాక్ డౌన్ విధించుకునే వెసులుబాటు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కల్పించింది. సెకండ్ వేవ్ లాక్ డౌన్ విధించుకునే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఇప్పటికే రెండుసార్లు లాక్ డౌన్ పొడిగించారు. మరోసారి పొడిగించనున్నారనేది ప్రస్తుత పరిస్థితులను బట్టి స్పష్టమవుతున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.