FbTelugu

మావోల చెరలో కోబ్రా కమాండో

బీజాపూర్: మావోయిస్టులు భద్రతా బలగాలపై దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. భారీ దాడిలో పెద్ద సంఖ్యలో బలగాలను కోల్పోయిన భద్రతా దళాల అధికారులకు కునుకు లేకుండా చేస్తున్నారు.

బీజాపూర్-సుక్ మా జిల్లల సరిహద్దు అటవీ ప్రాంతంలో హోరాహోరీ కాల్పుల్లో 22 మంది సిబ్బందిని కోల్పోయి దుఃఖంలో ఉన్న బలగాలకు మావోయిస్టులు మరో షాక్ ఇచ్చారు. ఈ ఘటన తరువాత వ కోబ్రా బెటాలియన్ కు చెందిన కమాండో రాకేశ్ సింగ్ మిన్హా కన్పించకుండా పోయారు. ఆయన కోసం పెద్ద ఎత్తున గాలింపు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. ఒకవైపు తనిఖీలు జరుగుతుండగా మరోవైపు ఆదివారం రాత్రి బీజాపూర్ లోని జర్నలిస్టులకు ఫోన్ కాల్స్ వచ్చాయి. కమాండఓ రాకేశ్ సింగ్ తమవద్ద బందీగా ఉన్నాడని వారు తెలిపారు. ఆయన క్షేమంగానే ఉన్నాడని, రెండు మూడు రోజుల్లో వదిలేస్తామని ఫోన్ చేసిన వ్యక్తులు తెలిపారు. ఎక్కడి నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు.

తన భర్తను రక్షించాలని కోరుతూ జమ్మూలో నివాసం ఉంటున్న కమాండో రాకేశ్ భార్య బోరున విలపించింది. క్షేమంగా తీసుకురావాలంటూ ఆమె ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు వినతి చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.