FbTelugu

వర్షాలతో నిలిచి బొగ్గు ఉత్పత్తి

పెద్దపల్లి: సింగరేణి కాలరీస్ సంస్థకు రామగుండంలో పెద్ద ఎత్తున గనులు ఉన్నాయి. ఇందులో ఓపెన్ కాస్ట్ తో పాటు అండర్ గ్రౌండ్ కూడా ఉన్నాయి. ఆదివారం నుంచి వర్షాలు కురుస్తుండడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.

కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు బయటకు తీయలేని పరిస్థితి నెలకొన్నది. రామగుండలో నాలుగు ఓపెన్ కాస్ట్ లలో పనులు స్థంభించిపోయాయి. ఫలితంగా రోజుకు 30వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనున్నది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతున్నది. ఇది రానున్న రెండు మూడు రోజుల్లో మరింతగా బలపడి పశ్చిమ వాయువ్య దిశ ఓడిశా, ఝార్ఖండ్, చత్తీస్ గఢ్ మీదుగా వెళ్లనుందని వాతావరణ విభాగం అధికారులు పేర్కొన్నారు. దీంతో సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.