FbTelugu

ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోగ్యం పై సిఎంఓ పర్యవేక్షణ

అమరావతి: కరోనా పాజిటివ్ నిర్థారణ తరువాత తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కొంత అశ్రద్ధ చేయడం మూలంగా ఊపిరితిత్తుల సమస్య తీవ్రం అయ్యింది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
ఐసియులో ఉన్న ఆమె పరిస్థితి ఎలా ఉందంటూ ఏపి సిఎం కార్యాలయం అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు.

కరోనా పాజిటివ్ వచ్చిన తరువాత ఆమె చికిత్స తీసుకున్నారు. అయితే పూర్తి స్థాయిలో చికిత్స తీసుకోకపోవడం మూలంగా అది ఊపిరితిత్తులకు పాకింది. దీంతో శ్వాస తీసుకునేందుకు ఆమె ఇబ్బంది పడుతుండడంతో హుటాహుటిన గచ్చిబౌలి లోని కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఒకటి రెండు రోజులు అయితే కాని ఆమె పరిస్థితి ఎలా ఉంటుందనే చెప్పలేమని వైద్యులు చెప్పినట్లు సమాచారం.

You might also like

Leave A Reply

Your email address will not be published.