FbTelugu

నెగెటివ్ వస్తేనే సీఎం పర్యటన లో చోటు

కడప: సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. 7వ తేదీ సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

సీఎం జగన్ పర్యటనకు వెళ్ళే అధికారులకు, పాత్రికేయులకు కరోనా టెస్టులు నిర్వహించారు. టెస్ట్ లో నెగిటివ్ వస్తేనే పర్యటనకు అనుమతించనున్నారు. కడప విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో ఇడుపులపాయ కు చేరుకోని అతిథి గృహంలో బస చేస్తారు. 8వ తేదీ ఉదయం వైఎస్సార్ ఘాట్ కు చేరుకోని కుటుంబ సభ్యులతో కలిసి దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి కి నివాళి అర్పిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ట్రిఫుల్ ఐటీకి చేరుకోనున్నారు.

ట్రిపుల్ ఐటీలో అభివృద్ధి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అకాడమీ కాంప్లెక్స్ భవనం ప్రారంభోత్సవం చేసి, సోలార్ పవర్ ప్రాజెక్టు కు పునాది రాయి వేయనున్నారు. అనంతరం ఇడుపులపాయ అతిథి గృహానికి చేరుకోని అరగంట పాటు విశ్రాంతి తీసుకోనున్నారు.

తరువాత కడప ఎయిర్ పోర్టుకు చేరుకోని గన్నవరం బయలుదేరనున్నారు. అధికారికంగా పర్యటన ఖరారు కావడంతో జిల్లా యత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది, ఆరు నెలల తర్వాత సీఎం స్వంత జిల్లాకు రానుండటంతో పటిష్టమైన చర్యలు చేపట్టారు. కోవిడ్ వైరస్ నేపథ్యంలో సీఎం పర్యటనకు పరిమిత సంఖ్యలో అనుమతించారు. జనం గుమి గూడకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.