అమరావతి: ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. సీఎం ఆకస్మిక ఢిల్లీ పర్యటన వెనుక రాజకీయాంశాలే అత్యధికంగా ఉన్నాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇవాళ (మంగళవారం) రాత్రి 9 గంటలకు ఆయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమవుతారు. భారీ వర్షాలు, నివర్ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలు, ధ్వంసమైన రహదారులు, ఆస్తినష్టం గురించి వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సదస్సులు విజయవంతం చేసేందుకు సహకరించాలని జగన్‌ను అమిత్‌షా కోరనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. రాత్రి ఢిల్లీలోనే బసచేసి బుధవారం ఉదయం తిరిగి అమరావతి వెళ్లిపోతారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రధానిని, ఇతర మంత్రులను కలిసే అవకాశం లేదని స్పష్టం చేశాయి.