FbTelugu

104 కాల్ సెంటర్ శ్రీరామ రక్ష: సీఎం జగన్

తాడేపల్లి: రాష్ట్రంలో 104 నెంబర్ కాల్‌ సెంటర్‌ పూర్తి స్థాయిలో సమర్థంగా పని చేసేలా జిల్లా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి సిఎం వైఎస్.జగన్ రెడ్డి ఆదేశించారు. ఆ నెంబర్‌కు ఫోన్‌ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలన్నారు.
సమీపంలోని ఆస్పత్రికి వెళ్లడమా, క్వారంటైన్‌కు పంపడమా, హోం ఐసొలేషనా? ఏం చేయాలన్నది స్పష్టంగా చెప్పాలని సిఎం సూచించారు. కరోనా కు సంబంధించిన అన్ని సమస్యలకు 104 నెంబర్‌ అన్నది వన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ అన్నది ప్రజల్లోకి బలంగా వెళ్లాలంటే, ఆ స్థాయిలో కాల్‌ సెంటర్‌ పని చేయాలని జిల్లా కలెక్టర్లను కోరారు. 104కు ఫోన్‌ చేసిన వెంటనే 3 గంటల్లో బెడ్‌ కేటాయించాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి రోగికి మందులు కూడా ఫ్రీగా ఇవ్వాలి. జిల్లా జెసి (గ్రామ వార్డు సచివాలయాలు. అభివృద్ధి) ఇక నుంచి కరోనా పైనే దృష్టి పెట్టాలన్నారు. ఆ అధికారికి అదే పని ఉండాలని, అప్పుడే మనం అనుకున్న స్థాయిలో సేవలందించగలుగుతామని జగన్ చెప్పారు.

మన అధీనంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు, కరోనా చికిత్స చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులు, కోవిడ్‌ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను కూడా జెసి చూడాలి.
నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, ఔషథాల లభ్యత, తగినంత మంది వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది, హెల్ప్‌ డెస్క్‌లు వాటిలో ఆరోగ్యమిత్రలు, సిసిటివి కెమెరాలు పని చేస్తున్నాయా? లేదా? అన్నది ప్రతి రోజూ చూడాలన్నారు. జిల్లా స్థాయిలో కరోనా ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించాలి. వాటికి ఇన్ ఛార్జీలను నియమించాలి. జిల్లా స్థాయి ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేయాలి. అందులో ఔషధ నియంత్రణ విభాగం అధికారులు కూడా ఉంటారు. అన్ని ఆస్పత్రులలో వైద్య సిబ్బంది, పారా మెడికల్‌ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలన్నారు. ఎక్కడ ఖాళీలున్నా వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించండన్నారు. 48 గంటల్లో నియామకాలు పూర్తి చేయండని సిఎం ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.