FbTelugu

ఏపి బడ్జెట్ కు మంత్రి మండలి ఆమోదం

సభలో రాజేంద్రనాథ్ రెడ్డి, మండలిలో కృష్ణదాస్
అమరావతి: ఏపి వార్షిక బడ్జెట్ 2021-22 కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ ఉదయం మంత్రివర్గ సమావేశం జరిగింది.
బడ్జెట్ కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తరువాత ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు అసెంబ్లీకి హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి.

ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వర్చువల్ గా ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసన సభ సలహా మండలి (బిఎసి) సమావేశం కానున్నది. ఈ సమావేశం ముగిసిన తరువాత ఉదయం 11 గంటల తర్వాత ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మహిళలు, పిల్లలకు చేస్తున్న ఖర్చును ప్రత్యేకంగా చూపనున్నారు. సామాజిక పెన్షన్లను రూ.2,500కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. శాసన మండలిలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.