FbTelugu

యోగీ… ఏమిటీ దారుణం!

లక్నో: ఉత్తరప్రదేశ్ లో మూఢ ఆచారాలకు ఇదొక సాక్ష్యం. తన భార్య శవాన్ని దహనం చేసుకునే పరిస్థితులు కూడా ఆ గ్రామంలో లేకపోవడంతో 15 కిలోమీటర్లు సైకిల్ పై ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లాడో పండు ముసలి వ్యక్తి. మార్గ మధ్యలోనే మృతదేహం పడిపోయింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలోని జౌన్పూర్ పరిధిలోని అంబెర్పూర్ గ్రామంలో తిలక్ ధారి సింగ్, ఆయన భార్య రాజకుమారి దేవి నివసిస్తున్నారు. భార్య కరోనా పాజిటివ్ తో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. అంత్యక్రియల కోసం అంబూలెన్స్ లో బుధవారం సొంత గ్రామానికి తీసుకువచ్చాడు. అంబూలెన్స్ లో తీసుకువచ్చిన వ్యక్తి స్మశాన వాటిక వరకు తీసుకువెళ్లకుండా గ్రామంలో వదిలేసి వెళ్లాడు. అంత్యక్రియలు జరిపేందుకు భర్త తిలక్ ధారి ఏర్పాట్లు చేస్తుండా గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహిస్తే, వైరస్ వ్యాపిస్తుందంటూ ససేమిరా అన్నారు. ఆశా కార్యకర్తలు ఎంతగా నచ్చచెప్పినా ప్రజలు విన్పించుకోలేదు.

గత్యంతరం లేదని భావించిన తిలక్ ధారీ కన్నీటి పర్యంతమయ్యాడు. గ్రామానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయి నదీ వద్ద భార్య అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించాడు. ఆటోలు, ట్రాక్టర్ మాట్లాడుకుని తీసుకువెళ్దామని సర్వ విధాలా ప్రయత్నించాడు. ఎవరూ రాకపోవడంతో తన ఇంట్లో ఉన్న సైకిల్ పై భార్య శవాన్ని తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో గుంతలు వచ్చి కింద పడిపోయాడు. సైకిల్ పై ఉన్న భార్య శవం కూడా పడిపోయింది. అతను పడుతున్న కష్టాన్ని చూసిన పోలీసు కానిస్టేబుల్ చలించిపోయాడు. వెంటనే ఈ విషయాన్ని ఇన్ స్పెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాడు. వెంటనే అంబూలెన్స్ పంపించి పోలీసులే దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు సహకరించిన పోలీసులకు భర్త తిలక్ ధారి ధన్యవాదాలు చెప్పాడు.

last rites of the womancm

 

You might also like

Leave A Reply

Your email address will not be published.