FbTelugu

హత్రాస్ జిల్లా మెజిస్ట్రేట్ పై సీఎం యోగి వేటు

లక్నో: హత్రాస్ అత్యాచార ఘనటలో జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ సరిగా వ్యవహరించలేదని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యానాథ్ ఆయన పై బదిలీ వేటు వేశారు.

నూతన సంవత్సరం ప్రారంభం రోజే ఆయనతో పాటు 16 మంది ఐఏఎస్ అధికారులను యోగి బదిలీలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. హత్రాస్ ఘటనపై సరైన చర్యలు తీసుకోవడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. దీంతో ఇవాళ ప్రవీణ్ కుమార్ ను మిర్జాపూర్ కు బదిలీ చేసింది. గతేడాది దేశ వ్యాప్తంగా ఈ అత్యాచార ఘటన ఒక్క కుదుపు కుదిపిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా పరామర్శించారు.  కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండానే ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన బాధితురాలిని పోలీసులే దహనం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.