FbTelugu

నేడు అయోధ్యకు సీఎం యోగి

లక్నో: రామ మందిర నిర్మాణ శంకుస్థాపన ముహూర్తం దగ్గరపడుతుండడంతో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ ఏర్పాట్లను పరిశీలించేందుకు నేడు అయోధ్య చేరుకోనున్నారు.
అయోధ్యలో ఏర్పాట్లు అన్నీ సీఎం యోగి పర్యవేక్షణలో జరుగుతున్నాయని, 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పునాది వేయనున్నారని బీజేపీ నాయకుడు వినయ్ కటియార్ తెలిపారు. డిప్యూటీ సీఎం కేశవ ప్రసాద్ మౌర్య రోడ్ల వెడెల్పు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారన్నారు.

రామ మందిర నిర్మాణం పనులు ప్రారంభించడం తమకు గర్వకారణం అని స్థానికుడు రమేష్ పేర్కొన్నారు. ఇది చారిత్రాత్మక క్షణం, నగరం అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అద్భుతంగా పనిచేస్తున్నాయన్నారు. ట్రాఫిక్ ను నియంత్రించేందుకు 12 ప్రాంతాల్లో వాహనాల మళ్లింపునకు పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది.

You might also like