FbTelugu

6 నెలల్లో 3 లక్షల ఉద్యోగాలు భర్తీ: సీఎం యోగి

లక్నో: ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించని విధంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిరుద్యోగులకు భారీ నజరానా ప్రకటించారు. మూడు నెలల్లో ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఉద్యోగాలు పొందిన వారికి ఆరు నెలల్లో అప్పాయింట్ మెంట్ లెటర్లు పంపించాలని ఆదేశించారు. ఇవాళ ఉద్యోగాల భర్తీపై సీఎం యోగి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఉద్యోగాల భర్తీలో ఎలాంటి అవినీతికి అవకాశం ఇవ్వొద్దని, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

ఉద్యోగాల ఖాళీలు, భర్తీపై త్వరలో యూపీ ఎస్సీ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు ఒక లక్షా ముప్పై ఏడు వేల పోలీసులు ఉద్యోగాలు, యాభై వేల టీచర్ ఉద్యోగాలు, ప్రభుత్వ శాఖలలో ఒక లక్షకు పైగా ఖాళీలను భర్తీ చేసినట్లు అధికారులు వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.