FbTelugu

నన్ను పిలవరు… నేను వెళ్లను!: సీఎం యోగి

లక్నో: అయోధ్యలో మసీదు నిర్మాణ ఆహ్వానంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికరన వ్యాఖ్యలు చేశారు. మసీదు శంకుస్థాపనకు మిమ్మల్ని పిలిస్తే వెళ్తారా అని ఒక జాతీయ న్యూస్ ఛానల్ యోగిని ప్రశ్నించింది.

దీనిపై ఆయన సమాధానమిస్తూ… నన్ను ఎవరూ పిలవరు, నేను వెళ్లను, నా పని ఏమున్నదో దానినే చేస్తానని స్పష్టం చేశారు. నా పనిని ధర్మబద్ధంగా, కర్తవ్య నిర్వహణగా భావిస్తూ ముందుకు వెళ్తానన్నారు. మసీదు శంకుస్థాపనకు నన్ను పిలవరు అని మరోమారు యోగి స్పష్టం చేసి చర్చకు ముగింపు పలికారు.

You might also like