FbTelugu

జగ్రత్తగా ఉంటారా? లాక్ డౌన్ విధించాలా!

సీఎం యడ్యూరప్ప వార్నింగ్

బెంగళూరు: కరోనా వైరస్ ప్రమాదం గురించి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావడం లేదు. జాగ్రత్తగా ఉంటారా లేదా మళ్లీ లాక్ డౌన్ విధించాలా అంటూ సీఎం బీఎస్.యడ్యూరప్ప వార్నింగ్ ఇచ్చారు.

మరోసారి లాక్ డౌన్ విధించకుండా ఉండాలంటే భౌతిక దూరం కచ్చితంగా పాటించాల్సిందేనని, వ్యక్తిగత శుభ్రత తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు. బెంగళూర్ నగరంలో కేసులు ఈ మధ్య బాగా పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చర్చించేందుకు ఇవాళ మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసినట్లు యడ్యూరప్ప తెలిపారు.

You might also like