న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచింది. ఈ విషయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది.
ఢిల్లీ సరిహద్దులోని సంఘా లో గత రెండు వారాలుగా రైతులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. భారత్ బంద్ కు మద్దతు తెలపాల్సిందిగా సోమవారం నాడు రైతులు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కలిశారు. ఈ విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఆయన బయటకు వెళ్లకుండా గృహనిర్బంధం చేసింది. ఆయన బయటకు వెళ్లకుండా, బయటి వ్యక్తులు లోనికి రాకుండా ఇంటి చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు.
ఆయనను కలిసేందుకు వెళ్తున్న ఆప్ ఎమ్మెల్యేలను కూడా పోలీసులు నిలువరించడంతో పాటు భౌతిక దాడికి దిగారు. సీఎం ఇంటి ముందు బీజేపీ నాయకులు ఆందోళన చేసేందుకు మాత్రం అనుమతించడం శోచనీయమని ఆప్ ఆరోపించింది. సోమవారం నాడు రైతుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించడం, రైతులు వచ్చిన ఆయనను కలిసి వెళ్ళిన తరువాత కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని ఆప్ ఆగ్రహం వ్యక్తం చేసింది.