FbTelugu

మధ్యప్రదేశ్ లో లాక్ డౌన్: సిఎం శివరాజ్

భోపాల్: మధ్యప్రదేశ్ లోను వారాంతపు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. అన్ని పట్టణాల్లో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటలకు లాక్ డౌన్ ఉంటుందని తెలిపారు.

పెద్ద నగరాల్లో కంటైన్మెంట్ జోన్లు పెంచుతున్నామని, ఆంక్షల అమలుపై డిజాస్టర్ మేనేజిమెంట్ ఫోర్స్ తో సమావేశం నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. భోపాల్, ఇండోర్ లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, అధికశాతం కేసులు ఈ నగరాల నుంచే నమోదు అవుతున్నాయన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్లు సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఇప్పటికే ఛత్తీస్ గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రలో లాక్ డౌన్ అమలుచేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.