FbTelugu

పంటల ప్రణాళిక, ఇ–మార్కెటింగ్‌ పై సీఎం సమీక్ష

అమరావతి: వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని… దాని పరిధిలో ఏయే పంటలు వేయాలన్నదానిపై పంటల ప్రణాళికను సిద్ధంచేయాలని సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి  ఆదేశించారు.

ఏయే రైతు ఏ పంట వేస్తున్నారన్నదానిపై ఇ–క్రాపింగ్‌ కోసం విధివిధానాలను మరింత సమగ్రంగా తయారుచేసి, వాటిని వైఎస్సార్‌ రైతు భరోసాకేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. రైతులు పండించిన పంటలను విక్రయించేందుకు ఇ–ప్లాట్‌ఫాంను కూడా సిద్ధంచేయాలన్నారు.

ఇవాళ క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ పంటల ప్రణాళిక, ఇ– క్రాపింగ్‌ అంశాలపై కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

సమావేశంలోని ముఖ్యమైన అంశాలు ఇవి:

వీలైనంత త్వరగా క్రాప్‌ ప్లానింగ్, ఇ– క్రాపింగ్‌పై విధి విధానాలు:

– వైఎస్సార్‌ రైతు భరోసాకేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని, దాని పరిధిలో ఏ పంటలు వేయాలన్నదానిపై మ్యాపింగ్‌ చేయాలి.

– జిల్లా, మండల స్థాయిల్లో అగ్రికల్చర్‌ సలహా బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలి.

– మార్కెటింగ్‌ చేయలేని పంటలు వేస్తే… రైతులకు నష్టం కలుగుతుంది.

– పంటల ప్రణాళికకు అనుగుణంగా విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలి.

– ఇ– క్రాపింగ్‌ మీద సమగ్ర విధివిధానాలను, ఎస్‌ఓపీలను వెంటనే తయారుచేయాలి.

– ఇ– క్రాపింగ్‌ విధివిధానాలను గ్రామ సచివాలయాల్లో,ఆర్బీకే కేంద్రాల్లో పెట్టాలి.

– వివాదాలు లేకుండా, పాదర్శకంగా ఈ విధివిధానాలు ఉండాలి.

– ఈ విధి విధానాలను వైయస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో ఉంచాలి.

– రైతులు పండించిన పంటల్లో 30శాతం కొనుగోలు చేయడంద్వారా మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచి, రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నాలను ప్రభుత్వం చేస్తుంది. మిగిలిన 70శాతం పంటకు కూడా కనీస గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నాలు చేయాలి.

– దీనికోసం ఇ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయాలి.

– ఇ– మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫాం మీద పంటలను అమ్మాలంటే నాణ్యత అనేది చాలా ముఖ్యం.  దీనికోసం గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాససింగ్‌ లాంటి సదుపాయాలను కల్పించాలి.

– ఇ– మార్కెటింగ్‌ ఫ్లాట్‌పాం విజయవంతం కావాలంటే సరైన రవాణా సదుపాయాలు, సకాలంలో రైతులకు చెల్లింపులు, వ్యవసాయ ఉత్పత్తుల్లో నాణ్యత పాటించడం అనే మూడు అంశాలు అత్యంత కీలకం

– ఈ మూడు అంశాలపై సమర్థవంతమైన ఆలోచనలు చేయాలి. ఖరీఫ్‌ చివరినాటికి ఆర్బీకే  పరిధిలో గ్రేడింగ్, ప్యాకింగ్‌ సదుపాయాలు.

– ముందుగా ప్రతి ఆర్బీకే పరిధిలో గ్రేడింగ్, ప్యాకింగ్‌ సుదుపాయాలు కల్పించాలని, ఈ ఖరీఫ్‌ పంట చేతికి వచ్చేనాటికి గ్రేడింగ్, ప్యాకింగ్‌ సిద్ధంకావాలి.

– 10,641 ఆర్బీకేలలో గ్రేడింగ్, ప్యాకింగ్‌ సదుపాయాలను ఏర్పాటుచేయాలి.

– వచ్చే సీజన్‌లో ఏర్పాటుచేయదలచిన జనతాబజార్లకూ ఈ విధానాలు దోహదపడతాయి.

– గ్రేడింగ్, ప్యాకింగ్‌ తర్వాత దశలో గ్రామాల్లో గోడౌన్లు, కోల్డ్‌స్టోరేజీలపై దృష్టిపెట్టాలి.

– గోడౌన్స్, కోల్డు స్టోరేజీలకు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు కావాలి.

– వీటికి అవసరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని సీఎం ఆదేశం.

– మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకుని తనకు నివేదించాలి.

You might also like