FbTelugu

కరోనా నియంత్రణ చర్యలపై జగన్ సమీక్ష

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ తాడెపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌ -19 ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్లను పరిశీలించి ప్రారంభించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పట్ల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో విశాఖ మెడ్ టెక్ జోన్ లో 1000 కోవిడ్ -19 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు తెలిపారు. వీటిద్వారా 50 నిమిషాల్లోనే టెస్టింగ్ రిపోర్ట్ తెలుసుకునే సామర్థ్యం ఉన్నట్టు తెలిపారు.

ఒక్క కిట్ తో రోజుకు 20 టెస్ట్ లు చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఇంకో వారం రోజుల్లో 10 వేల కోవిడ్ టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల నాని, మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, పరిశ్రమలు శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రజత్‌ భార్గవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

You might also like